పోచెఫ్‌స్ట్రూమ్(దక్షిణాఫ్రికా): అండర్-19 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్ పోరులో భారత బౌలర్లు మరోసారి ఆకట్టుకున్నారు. పాకిస్థాన్‌తో కీలక పోరులో బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసి తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 43.1 ఓవర్లలో 172 పరుగులే చేసి ఆలౌటైంది. ఓపెనర్ హైదర్ అలీ(56: 77 బంతుల్లో 9ఫోర్లు), నజీర్(62: 102 బంతుల్లో 6 ఫోర్లు) అర్ధశతకాలతో రాణించడంతో పాక్ ఆమాత్రం స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లు సుశాంత్ మిశ్రా(3/28), కార్తీక్ త్యాగీ(2/32), రవి బిష్ణోయ్(2/46) కళ్లుచెదిరే బౌలింగ్‌తో పాక్‌ను కుప్పకూల్చారు. పాక్ ఇన్నింగ్స్‌లో భారత బౌలింగ్, ఫీల్డింగ్ హైలెట్‌గా నిలిచింది.